Tuesday, April 30, 2024
- Advertisement -

సౌత్‌లో నెం 1 మ‌హేశ్ బాబేన‌ట‌..!

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు క్రేజ్ గురించి అంద‌రికి తెలిసిందే. సినిమా సినిమాకు అభిమానులను పెంచుకుంటున్నాడు. చూడ‌టానికి హాలీవుడ్ హీరోలా క‌నిపిస్తాడు మ‌హేశ్ బాబు. మ‌హేశ్ ఖాతాలో మ‌రో రికార్డు వ‌చ్చి చేరింది. మ‌హేశ్ సినిమాల‌తో పాటు,యాడ్‌లు కూడా చేస్తాడు. ఇంకా చెప్ప‌లంటే సినిమాల‌లో క‌న్నా యాడ్స్‌లోనే ఎక్కువుగా క‌నిపిస్తుంటాడు మ‌హేశ్. ఈ యాడ్‌లకు సంబంధించి ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు మ‌హేశ్‌. మహేష్ ప్రస్తుతం దాదాపు 15 బ్రాండ్‌లకు పైగా ప్రచారకర్తగా ఉన్నాడు.

గోల్డ్ విన్నర్, అభిబస్, చెన్నై సిల్క్స్, క్లోజ్ అప్‌లతో పాటు థమ్స్ అప్ వంటి ప్రముఖ కంపెనీల యాడ్స్ చేస్తున్నాడు మ‌హేశ్‌. ఇలా నటిస్తూ సౌత్‌లోనే టాప్ బ్రాండ్ అంబాసిడర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మ‌హేశ్ థియోట‌ర్‌ను కూడా మొద‌లు పెట్టాడు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే మ‌హేశ్ త‌న 25వ సినిమా మ‌హ‌ర్షి షూటిగంగ్‌లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిప‌ల్లి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డె నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -