రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా భారీ డిజాస్టార్‌గా నిలిచింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ సైతం సినిమా బాలేదని తేల్చేశారు. సినిమా అంత రక్తపాతంతో నింపేశాడు బోయపాటి. దీంతో ఫ్యామిలీ ఆడియోన్స్ ఈ సినిమా వైపు చూడలేదు.
అయితే ఇంతటి డిజాస్టార్ సాధించిన తరువాత కూడా సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయి అంటే అది రామ్ చరణ్ క్రేజ్ వల్లే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా 11 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్ల షేర్ ని సాధించిగా, ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు అయితే తప్పేలా లేవు. అయితే ఈ నష్టాలు భారీ స్థాయిలో లేకపోవడం ఊరట కలిగించే అంశంగా చెప్పాలి.
- Advertisement -
ఫ్లాప్ సినిమాకు 60 కోట్ల కలెక్షన్లు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -