బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన చిత్రం మణికర్ణిక. ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరెక్కకింది. రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లక్ష్మీబాయిగా కంగనా యాక్టింగ్‌కు నూటికి నూరు మార్కులు కొట్టేసింది. సినిమా కలెక్షన్లు కూడా అదేవిదాంగా ఉన్నాయి. మణికర్ణిక దేశవ్యాప్తంగా 3 రోజుల్లో 46 కోట్లను వసూలు చేసింది.
అంటే 50 కోట్ల మార్క్ కి చేరువైపోయింది. ఈ సినిమా ఈజీగానే 100 కోట్ల మార్కును అందుకుంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమాకు ఎక్కువ భాగం తెలుగు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించాడు. కంగనాతో విభేదాలు రావడంతో సినిమా నుంచి తప్పుకున్నాడు క్రిష్. సినిమా మిగిలిన భాగానికి కంగానానే దర్శకత్వం వహించింది.
- భార్యను హతమార్చి, తలను ఫ్రిడ్జ్‌లో పెట్టి..
- ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్!
- పాండ్యాతో డేటింగ్ ప్రచారంపై అమీషా పటేల్ ఏమన్నారంటే..?
- బిగ్‌బాస్ సీజన్-10 ప్రారంభం
- అశ్లీల పరిశ్రమను చట్టబద్ధం చేయాలని ఉక్రెయిన్ యోచన!
