అక్కినేని నట వారసుడు అఖిల్ కోసం తెగ కష్టపడుతున్నాడు కింగ్ నాగర్జున. అఖిల్ కోసం నాగ్ చేయని ప్రయత్న లేదు. మొదటి సినిమానే స్టార్ డైరెక్టర్ వివి వినాయక్‌తో చేయించాడు నాగ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇక అఖిల్ రెండో సినిమా కోసం మనం డైరెక్టర్‌ను రంగంలోకి దించాడు. ఇది కూడా అఖిల్‌కు హిట్ ఇవ్వలేకపోయింది. తాజాగా అఖిల్ నటించిన మూడో చిత్రం మిస్టర్ మజ్ను సినిమా కూడా డిజాస్టార్‌గా నిలిచింది. దీంతో అఖిల్‌ను కొంతకాలం సినిమాలు మానేయమని సూచన ఇచ్చాడట నాగ్. కాని తన నాల్గోవ సినిమాను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నడట అఖిల్. ఈ క్రమంలో శ్రీనువైట్ల, పూరి జగన్నాథ్ వంటి దర్శకుల పేర్లు వినిపించాయి.
తాజాగా ఈ లిస్ట్‌లోకి క్రిష్ వచ్చి చేరాడు. అఖిల్ కోసం క్రిష్‌ను రంగలోకి దించాడు నాగ్. అఖిల్‌కు ఓ సినిమా చేసి పెట్టమని క్రిష్‌ను కోరాడట నాగర్జున. దీనికి క్రిష్ కూడా ఒకే చెప్పాడని సమాచారం. అఖిల్‌కు సంబంధించిన సినిమా కోసం కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడట క్రిష్. ఈ సినిమా రెండు జన్మలకు సంబంధించినది ఉంటుందని సమాచారం. క్రిష్ వంటి దర్శకుడితో పని చేస్తే అఖిల్ నటుడుగా మరింత ఎదుగుతాడని భావిస్తున్నాడు నాగ్. మరి ఇప్పటి వరకు కమర్షియల్ హిట్ లేని క్రిష్, అఖిల్‌కు ఎలాంటి హిట్‌ను ఇస్తాడో చూడాలి. క్రిష్ ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!