ఎన్టీఆర్ జీవితం ఆధారంగా చాలానే సినిమాలు తెరకెక్కుతున్నాయి. . ఇప్పటికే ఆయన తనయుడు బాలకృష్ణ నటించి ,నిర్మించిన కథానాయకుడు విడుదల అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఇక రెండో పార్ట్ మహనాయకుడు విడుదలకు రెడీ అవుతోంది. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తు, నిర్మిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మి పార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్,పోస్టర్స్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి బయటికి వచ్చింది.
ఎన్టీఆర్ పెద్ద కొడుకు దివంగత నటుడు ,టీడీపీ ఎంపీ అయిన హరికృష్ణ గురించి ఈ సినిమాలో నెగిటివ్‌గా చూపించబోతున్నాడట రామ్ గోపాల్ వర్మ. లక్ష్మి పార్వతి, హరికృష్ణకు మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి. ఎన్టీఆర్ చనిపోయిన తరువాత ఈ విభేదాలు మరింత ముదిరాయి. ఒకరిపై మరోకరు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. తాజాగా హరికృష్ణ ఎపిసోడ్‌ను తన సినిమాలో మరింత నెగిటివ్‌గా చూపించబోతున్నాడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈ సినిమాలో హరికృష్ణ పాత్రను ఎవరు పోషిస్తున్నారో మాత్రం బయటికి చెప్పడం లేదు వర్మ. సినిమా షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసి వచ్చే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. విడుదలకు ముందే ఈ సినిమా ఇన్ని సంచలననాలను సృష్టిస్తున్న ఈ సినిమా విడుదల తరువాత ఇంకెన్ని సంచనాలతోపాటు , వివాదాలు సృష్టిస్తుందో చూడాలి.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!