అసలు ఓ అవసరం కోసం, కెరీర్ కోసం ఏదో చేసి, వాడు నన్ను గోకాడు, ఇలా అన్నాడంటూ దానికి మీటూ అని చెప్పడం కరెక్ట్ కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది నటి హేమ. అసలు సినిమా ఇండస్ట్రీలోనే కాదు… బయట కూడా చాలానే జరుగుతున్నాయనీ, మరి అలాంటి వాటి సంగతి ఏంటని డైరెక్ట్‌గానే ప్రశ్నిస్తున్నారు హేమ.
అసలు నటి హేమ పేరు చెబితేనే చాలా బోల్డుగా మాట్లాడుతుంటారని టాక్. నిజంగా మరోసారి అలాగే మాట్లేడేసారు నటి హేమ. ఓ యూ ట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ #MeToo గురించి స్పందించారు.
ఆ శ్రీరెడ్డి చేసిన హంగామాకు ఇప్పుడు హైదరాబాదులో సినిమా వాళ్లకు ఇళ్లు అద్దెకు దొరకడంలేదంటూ చెప్పుకొచ్చారు. స్త్రీలు, పురుషులు కలిసి పనిచేసే చోట సహజంగానే కొన్ని ఇబ్బందులు వుంటాయనీ.. ఎవడైనా తేడాగా ప్రవర్తిస్తే వాడి పట్ల కఠినంగా ఉంటే ఇంకోసారి ఆ పని చేస్తాడా? అంటు రివర్స్‌లో ప్రశ్నించారు. ఇండస్ట్రీలో చాలామంచివాళ్లున్నారని వ్యాఖ్యానించింది.
సినిమా ఇండస్ట్రీలో ఎవరూ రేప్ చేయరనీ, కెరీరో కోసం తమకు తామే సమర్పించుకుంటే అది వాళ్ల తప్పెలా అవుతుందని ప్రశ్నించింది హేమ. ఒకవేళ ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే అతడితో తనకు ఇష్టం లేదని చెప్పుకునే మాట ఒకటుందని చెప్పుకొచ్చింది హేమ.