తొలిప్రేమ సినిమా పవన్ కెరీర్‌లో తొలి సూపర్ హిట్ సినిమా. ఈ సినిమాతోనే పవన్ కల్యాణ్ పవర్‌స్టార్‌గా మారాడు. ఇక ఈ సినిమాతో ఇప్పటికి బండి లాగిస్తున్నాడు దర్శకుడు కరుణకరన్. కాని ఈ సినిమాలో నటించిన హీరోయిన్ కీర్తిరెడ్డి మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. తొలిప్రేమ సినిమా తరువాత కీర్తిరెడ్డి కొన్ని సినిమాలలో నటించనప్పటికి అవి పెద్దగా విజయం సాధించలేదు. ఇదే సమయంలో అక్కినేని హీరో సుమంత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కీర్తిరెడ్డి.
కొంతకాలం వీరి కాపురం బాగానే సాగింది. తరువాత వీరిద్దరి అభిప్రాయభేదాలు రావడంతో సుమంత్ నుంచి విడాకులు తీసుకుంది కీర్తి. తరువాత బెంగళూరుకు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున అమెరికా వెళ్లిపోయింది. చాలాకాలం తరువాత ఇండియాకు తిరిగి వచ్చింది కీర్తి రెడ్డి. తాజాగా కీర్తిరెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్‌ను కలవడం కోసం హైదరాబాద్ వచ్చింది. ఇలా హైదరాబాద్‌కు వచ్చిన కీర్తిరెడ్డిని చూసి చాలామంది షాక్ అయ్యారట. ఆమె కీర్తిరెడ్డి అని గుర్తు పట్టాడానికి చాలా సమయమే పట్టిందట కొందరికి. ఎందుకంటే..ఆమె చాలా లావుగా మారడంతో పాటు. కీర్తిరెడ్డి ఫేస్‌లో మునపటి బ్లో లేదని చూసినవారు చెబుతున్నారు. కీర్తిరెడ్డిలో ఇంతకముందు ఉన్న అందాలు ఏమి కనిపిండం లేదట.
కొత్త రూపంలో కీర్తిరెడ్డిని చూసే సరికి షాక్ అవ్వడం అభిమానులు వంతైంది. సినిమాలు మానేసి చాలాకాలం అయిన కీర్తిరెడ్డి మునపటిలా ఉండాలంటే కొంచెం కష్టమే. ఏది ఏమైనప్పటికి కీర్తిరెడ్డిలో చాలా మార్పు వచ్చిందనేది వాస్తవం.
- మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు: జగన్
- నిర్మాతగా మారిన యాంకర్ ఉదయభాను!
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
