తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ టాప్ హీరో తాగి రచ్చ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే …టాలీవుడ్ టాప్ హీరోలలో ఇతను కూడా ఒకరు. ఎప్పుడు పార్టీలను ఇస్తు లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తాడు ఈ హీరో. అలవాటుగానే తన ఫ్రెండ్స్, సన్నిహితులను పిలిచి మరి ఓ రెస్టారెంట్‌లో గ్రాండ్‌గా పార్టీ ఇచ్చాడట. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరైయ్యారని సమాచారం. ఈ పార్టీలో మన హీరో బాగా తాగేసి రచ్చ రచ్చ చేశాడట. పార్టీకి వచ్చిన వారిని సైతం బూతులతో తిట్టి మరి అవమానించాడట. పార్టీకి వచ్చిన వారికి ఫ్రీగా మందుతో పాటు బూతులను కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడట సదరు హీరో.
కొంతమంది ఈ హీరోని ఆపే ప్రయత్నం చేసినప్పటికి కూడా లాభం లేకపోయిందట. ఈ పార్టీకి వచ్చిన వారి ఎఫైర్స్ గురించి బయట పెడుతు రచ్చ రచ్చ చేశాడట మన హీరో. దీంతో అక్కడే ఉన్న మిగిలిన వారు తమ ఎఫైర్లు ఎక్కడ బయటపడతాయో అని భయంతో ఆ పార్టీ నుంచి సైలెంట్‌గా జారుకున్నారని సమాచారం. ఈ ఘటన పోయిన ఆదివారం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జుబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఇది అంతా రికార్డు అయిందని ఆ పార్టీకి వచ్చిన వారు చెబుతున్నారు. ఇంత జరిగినప్పటికి ఆ హీరో పార్టీలను మాత్రం వదలడం లేదట. ఇంతకి ఆ హీరో పేరు మాత్రం బయటికి రావడం లేదు.
- శూర్పణఖ రోల్.. అందుకోసమే ఒప్పుకున్నా!
- బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ విజయం..
- విశాఖ – బెంగళూరు వందేభారత్ స్లీపర్‌కు గ్రీన్ సిగ్నల్, రూట్ ఇలా..
- అరుణాచలం వచ్చే భక్తులకు కొత్త నిబంధనలు.. మోక్ష మార్గంలో వారికే అనుమతి..
- లివింగ్ రిలేషన్ షిప్..సుప్రీం సంచలన తీర్పు
