Tuesday, April 30, 2024
- Advertisement -

సల్మాన్ తాజా సినిమా.. నాగార్జున సినిమాకు రీమేకా..?!

- Advertisement -

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు రీమేక్ లు కొత్త కాదు. తన కెరీర్ లో ఇప్పటి వరకూ అనేక సార్లు రీమేక్ సబ్జెక్టును డీల్ చేశాడు ఈ హీరో. దక్షిణాదిన హిట్ అయిన ఆనేక సినిమాల హిందీ వెర్షన్లలో ఈ హీరో నటించాడు. అలనాటి ‘హలోబ్రదర్’ దగ్గర్నుంచి చెప్పుకొంటే పోతే ఎన్నో సినిమాలను ఈ హీరో డీల్ చేశాడు.

ఇటీవలి కాలంలోనే వరసగా “పోకిరి” “రెడీ” ‘బాడీగార్డ్” వంటి సౌతిండియన్ మూవీస్ ను సల్మాన్ హిందీలో రీమేక్ చేశాడు. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఈ హీరో మరో దక్షిణాది సినిమాను రీమేక్ చేశాడని టాక్ వస్తోంది. అది కూడా నాగార్జున సినిమాను!

దాదాపు రెండేళ్ల కిందట ‘రాజన్న’ అనే సినిమా ఒకటి తెలుగులో వచ్చింది. ఈ సినిమాలో నాగార్జున ఒక ముఖ్య పాత్ర పోషించాడు. సినిమా ఆసాంతం కనిపించడు కానీ.. కొంత సేపు మాత్రమే కనిపించినా నాగార్జున కెరీర్ లో ‘రాజన్న’ ఒక మంచి సినిమాగా నిలిచిపోయింది. ఇప్పుడు సల్మాన్ ఆ సినిమాను రీమేక్ చేసినట్టుగా టాక్!

తాజాగా ఫస్ట్ లుక్ విడుదల అయిన “భజరంగీ భాయ్ జాన్” సినిమా ‘రాజన్న’కు రీమేక్ అని తెలుస్తోంది. తెలుగులో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సల్మాన్ కొన్ని మార్పులతో రీమేక్ చేసినట్టుగా తెలుస్తోంది. రాజన్న స్క్రిప్ట్ లో సత్తాను చూసే సల్మాన్ దీన్ని రీమేక్ చేశాడంటున్నారు. మరి ఈ సినిమా హిందీలో ఎంత మేరకు హిట్ అవుతుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -