Sunday, May 5, 2024
- Advertisement -

అలాంటి టైటిల్స్ కలిసిసొస్తున్నాయ్.. సూర్య ఈజ్ బ్యాక్!

- Advertisement -

అప్పుడెప్పుడో ‘గజిని’ తో తెలుగులో సూపర్ హిట్ కొట్టాడు సూర్య. ఆ సినిమాతో తన లుక్స్ తో.. తన నటనతో ప్రత్యేక అభిమానగణాన్ని కూడా సంపాదించుకొన్నాడు ఈ హీరో. ఆ తర్వాత సూర్య తమిళంలో నటించిన అనేక సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి.

ఒకటి కాదు రెండు కాదు..డజన్ల కొద్దీ సినిమాలొచ్చాయి. అయితే వాటిలో తెలుగువాళ్లను బాగా ఆకట్టుకొన్న సినిమాలు మాత్రం చాలా తక్కువ! ఎక్కువశాతం సినిమాలు ప్లాఫ్ అయ్యాయికూడా!

ఇలా వరస ప్లాఫుల నేపథ్యంలో కూడా సూర్య సినిమాల పట్ల తెలుగు ప్రేక్షకుల్లో అంతో ఇంతో ఆసక్తి కనిపించింది. అలాంటి అంచనాలను, ఆసక్తులను అందుకోలేకపోయాయి సూర్య సినిమాలు. మధ్య లో ‘యముడు’ ‘సింగం’ వంటి సినిమాలు ఓకే కానీ.. ‘సికిందర్’ వంటి సినిమాలు మాత్రం డిజాస్టర్స్ అయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో తెలుగులో సూర్య కథ అయిపోయిందని అన్నవాళ్లూ ఉన్నారు.

ఇలాంటి నేపథ్యంలో ‘రాక్షసుడు’ సినిమా వచ్చింది. ఈ సినిమా టైటిలే దీనికి కొంత నెగిటివ్ అయ్యింది. అయితే ఇలాంటి నెగిటివ్ టైటిల్స్ సూర్యకు కలిసొస్తున్నాయి. హీరోని ‘యముడు’ గా చూపించిన సినిమా హిట్ అయినట్టుగానే ‘రాక్షసుడి’గా చూపిన సినిమాకు కూడా పాజిటివ్ రివ్యూలు కనిపిస్తున్నాయి. సినిమాకు హిట్ టాక్ లభిస్తోంది.ఈ విధంగా సూర్య కు తెలుగులో మరో హిట్ లభించినట్టే! మరి కలెక్షన్ల విషయంలో రాక్షసుడు ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడనేదే ఇక ఆసక్తికరమైన అంశం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -