ఆ అడ‌ల్ట్ మూవీకి బెనిఫిట్ షోలు కూడా

అడ‌ల్ట్ కంటెంట్‌కు మంచి డిమాండ్ ఉన్న స‌మ‌యం అనుకోవ‌చ్చు. ఈ మ‌ధ్య‌ వ‌చ్చే సినిమాల‌న్ని కూడా అలానే ఉన్నాయి. అదే కాన్సెప్ట్‌తో కోలివుడ్‌లో వ‌చ్చిన 90 ఎంఎల్‌పై ఎక్స్‌పెక్టేష‌న్స్ మాములుగా లేవ‌నే చెప్పాలి. గతేడాది బిగ్ బాస్ తో యూత్ కు హాట్ ఐకాన్ గా మారిన ఓవియా ప్రధాన పాత్రలో రూపొందింది ఈ మూవీ. ఈ మూవీ ట్రైల‌ర్ చూసిన ద‌గ్గ‌రి నుంచి కుర్ర‌కారు సినిమా రిలీజ్‌కోసం వెయిట్ చేస్తున్నారు.

ఓవియా హాట్ హాట్ గ్లామర్ షో పుణ్యమా అని 90 ఎంఎల్ అక్కడ హాట్ కేక్‌గా మారింది. దీని మీద హైప్ ఏ రేంజ్‌లో ఉందంటే స్టార్ హీరోలకు ధీటుగా బెనిఫిట్ షోలు వేస్తున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్ప‌టికే సెన్సార్ అభ్యంతరాల వల్ల ఓ వారం వాయిదా వేయక తప్పలేదని తెలుస్తోంది. అనద్దు కానీ.. బహుశా ఈ మధ్యకాలంలో ఇంత భారీ ఎత్తున విడుదల అవుతున్న బూతు సినిమా ఇదే కాబోలు.

ఈ మూవీ తెలుగులో రిలీజ‌వుతుందా లేదా అన్న దానిపై అనుమానాలున్నాయి. 90 ఎంఎల్ టైటిల్ ఇప్పటికే హీరో కార్తికేయ కోసం శేఖర్ రెడ్డి అనే డెబ్యూ డైరెక్టర్ రిజిస్టర్ చేసి పెట్టారు. మ‌రి ఏం జ‌రుగుతుందో వేచి చూడాల్సిందే.