Sunday, May 19, 2024
- Advertisement -

లెజెండ్ హెడ్ బ్యాండ్ వెనుక క‌థ ఏంటో తెలుసా?

- Advertisement -

కోడి రామ‌కృష్ణ అన‌గానే గుర్తొచ్చేది.. ఆయ‌న తీసిన సినిమాల లిస్ట్ కాదు.. ఆయన రికార్డుల ప‌రంప‌రా కాదు. మ‌రింకేంటి అనుకుంటున్నారా? ఓ హెడ్ బ్యాండ్‌. అవును మ‌నం చూసే చాలా ఫోటోల్లో ఆయ‌న హెడ్‌బ్యాండ్ ధ‌రించే ఉంటారు. ఇంకొంచే ప‌రీక్ష‌గా గ‌మ‌నిస్తే చేతులకు తాళ్లు, వేళ్లకు ఉంగరాలు కూడా ఉంటాయి. దీనిని బ‌ట్టే అర్థ‌మ‌వుతోంది ఆయ‌న‌కు సెంటిమెంట్లు ఎక్కువ అని.

కోవలం బీచ్ దగ్గర తన రెండో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు… ఎన్టీఆర్ కాస్ట్యూమర్ మోకా రామారావుగారు తన వద్దకు వచ్చారని… విశాలంగా ఉన్న మీ నుదురు ఎండకు ఎక్స్ పోజ్‌ అవుతోందని చెప్పి, జేబు రుమాలు ఇచ్చి కట్టుకోమని చెప్పారని రామ‌కృష్ణ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. కానీ అది ఆ ఒక్క‌రోజుతో ఆగ‌లేద‌న్నారు. మరుసటి రోజు మ‌ళ్లీ ఆయ‌నే బ్యాండ్‌లా తయారు చేసి తీసుకొచ్చారని చెప్పారు. అక్క‌డితో ఆగ‌కుండా ఇది అందరికీ మ్యాచ్ అవదని, మీకు బాగా సూట్ అయిందని కాంప్లిమెంట్ ఇస్తూ… దీన్ని కట్టుకోకుండా ఎప్పుడూ ఉండవద్దని తనకు చెప్పారని గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి షూటింగ్ లో బ్యాండ్ కట్టుకోవడం తన సెంటిమెంట్ అయిందని చెప్పారు. పోలీసులకు టోపీ, రైతులకు తలపాగా ఎలాగో… తనకు బ్యాండ్ అంత పవిత్రమైనదని తెలిపారు.

ఇక త‌న అమ్మ‌మ్మ వ‌ల్ల తనలో భక్తి భావం పెరిగింద‌ని… పొద్దున్నే నాలుగు గంటలకు కాలువకు తీసుకెళ్లి, స్నానం చేయించి, అక్కడి నుంచి గుడికి తీసుకెళ్లేదని కోడి రామకృష్ణ చెప్పారు. అప్పటి నుంచి చేతికి తాడు, కంకణాలు కట్టుకోవడం అలవాటైందన్నారు. ఇక ఉంగ‌రాల విష‌యానికి వ‌స్తే త‌న జ్యోతిషులు కమ్ ఫ్రెండ్స్ సూచ‌న మేర‌కే వాటిని ధ‌రించేవార‌ని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -