- Advertisement -

బిగ్‌బాస్ కౌశ‌ల్‌కు ఛాలెంజ్ చేసిన టీవీ 5 మూర్తి

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ విన్న‌ర్ కౌశ‌ల్‌కు త‌న అభిమానుల‌కు మ‌ధ్య పెద్ద వార్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. త‌నపై వ‌చ్చ‌న ఆరోప‌ణ‌ల‌కు వివ‌ర‌ణ ఇచ్చేందుకు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన కౌశ‌ల్ టీవీ 5 మూర్తి, న‌టుడు త‌నీష్ ఇద్ద‌రు క‌లిసి త‌న‌పై కుట్ర చేస్తున్నార‌ని ఆరోపించారు. తాను క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న పేరు మొత్త‌న్ని వీరిద్ద‌రు క‌లిసి నాశ‌నం చేశార‌ని కామెంట్స్ చేశాడు కౌశ‌ల్‌. దీనిపై స్పందించారు టీవీ 5 మూర్తి. మీకు ద‌మ్ముంటే నీపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు నిజం కాద‌ని నిరుపించుకోవాలి కాని ఇలా ప్ర‌శ్నించిన వారిపై దాడికి దిగ‌డం స‌రైన ప‌ద్ద‌తి కాద‌ని హిత‌వు ప‌లికారు.

మీరు త‌ప్పు చేసిన‌ట్లు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, అందుకే డిబేట్ నిర్వ‌హించాన‌ని తెలిపారు మూర్తి. త‌నీష్‌తో నేను ఒక్క క‌ప్పు కాఫీని కూడా తాగ‌లేద‌ని , నేను త‌ప్పు చేసిన‌ట్లు మీ ద‌గ్గ‌ర ఆధారాలు ఉంటే నేను ఎటువంటి శిక్ష‌కు అయిన రెడీ అని చెప్పారు. నేను త‌ప్పు చేసిన‌ట్లు నిరుపిస్తే నేను జ‌ర్న‌లిజం వ‌దిలేసి వెళ్లిపోతాన‌ని కౌశ‌ల్‌కు స‌వాల్ విసిరారు. నాకు పెళ్లే కాలేదు , నాకు పిల్ల‌లు ఎక్క‌డ నుంచి వ‌చ్చారో కౌశ‌లే చెప్పాలి. మేం మీతో మాట్లాడ‌టానికి ఎంతో ప్ర‌య‌త్నించం, కాని మీరు మాతో మాట్లాడ‌టానికి స‌ముఖ‌త వ్య‌క్తం చేయ‌లేదని తెలిపారు మూర్తి.మ‌రి మూర్తి విసిరిన స‌వాల్‌కు కౌశ‌ల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -