Monday, April 29, 2024
- Advertisement -

ర‌న్నింగ్ ప్లేన్‌లో కునుకేసిన పైల‌ట్

- Advertisement -

ఆకాశ‌వీధిలో దూసుకుపోతున్న విమానంలో పైల‌ట్ నిద్ర‌పోతే ఏంటీ ప‌రిస్థితి? అందులో ఉన్న ప్ర‌యాణికుల ప‌రిస్థితి ఏంటీ? విన‌డానికే భ‌యంక‌రంగా ఉంది క‌దా. కానీ ఇది నిజం. చైనా ఎయిర్‌లైన్స్ సంస్థ‌ తైవాన్స్ నేషనల్ క్యారియర్‌కు చెందిన బోయింగ్ 747 మోడల్ విమానం పైలట్ వెంగ్ జియాకీ విమానం టేకాఫ్ తీసుకున్నాక ఓ కునుకు తీశాడు.

పైలట్ నిద్రపోతుండగా కోపైలట్ అత‌డిని లేప‌కుండా ఓ వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది అలా అలా ఆ వీడియో ఎయిర్‌లైన్స్ అధికారుల వ‌ర‌కు వెళ్లింది. ఇంకేముంది ఈ విష‌యం తెలుసుకోగానే వెంటనే ఆ పైలట్‌పై చర్యలు తీసుకున్నారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. అత‌ను నిద్ర‌పోతుంటే అత‌డిని లేప‌కుండా వీడియో తీస్తావా? అక్క‌డితో ఆగ‌కుండా దానిని షేర్ చేస్తావా అంటూ కోపైల‌ట్‌కు కూడా త‌లంటారు స‌ద‌రు విమానాయాన సంస్థ ప్ర‌తినిధులు.

ఆ పైలట్ త‌మ‌ సంస్థలో గత 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడ‌ని ఆ ఎయిర్‌లైన్స్ ప్ర‌క‌టించింది. కాక్‌పీట్‌లో నిద్రపోవడం తప్పని తనే ఒప్పుకున్నాడ‌ని… అయినప్పటికీ.. అతడిపై చర్యలు తీసుకున్నామ‌ని తెలిపారు.

అయితే చైనా ఎయిర్‌లైన్స్ పైలట్స్.. తమ వర్కింగ్ అవర్స్ తగ్గించాలని.. తమకు అలసట, ఒత్తిడి ఎక్కువవుతోందంటూ ఏడు రోజులు సమ్మె చేశారు. ఆ సమ్మె ముగిసిన కొన్ని రోజులకే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ఘటన చైనాలో చర్చనీయాంశమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -