Sunday, May 11, 2025
- Advertisement -

ఆయుధాల విష‌యంలో ఇండియా అంత వెనుక‌ప‌డి ఉందా?

- Advertisement -

పుల్వామా ఉగ్ర‌దాడి త‌రువాత భార‌త్‌-పాక్‌ల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇరు దేశాల మ‌ధ్య యుద్ధం అనివార్య‌మ‌నుకున్నారు. కానీ పాక్‌కు యుద్ధం చేసే స‌త్తా లేద‌ని అంద‌రికి తెలుసు. మ‌రి భార‌త్ పరిస్థితి ఏమిటీ? పూర్తిస్థాయి యుద్ధానికి భార‌త్ సిద్ధంగా ఉందా? ఒక‌వేళ యుద్ధ‌మే వ‌స్తే.. భార‌త్ ఎన్ని రోజులు త‌ట్టుకొని నిల‌బ‌డ‌గ‌ల‌దు? భార‌త్ ఆయుధాల ప‌రిస్థితి ఏంటీ. మ‌న ద‌గ్గ‌ర ఎంత ఆయుధ గారం ఎన్ని ఆయుధాలు నిల్వ ఉన్నాయి? అవి ఇప్పుడు ప‌నికి వ‌స్తాయా? ఇలాంటి అంశాల‌ను తీసుకొని న్యూయార్క్ టైమ్స్ ఓ క‌థ‌నాన్ని రాసింది.

భారత భద్రతా దళాల గురించి న్యూయార్క్ టైమ్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండియా పూర్తిస్థాయి యుద్ధం చేయాల్సి వ‌స్తే 10 రోజుల్లో భారత ఆయుధాగారం మొత్తం ఖాళీ అయిపోతుందని తెలిపింది. పాక్, భారత్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ పత్రిక దక్షిణాసియా స్టాఫ్‌ కరస్పాండెంట్‌ మరియా-అబీ-హబీబ్‌ ఈ కథనాన్ని రాశారు.

అక్క‌డితో ఆగ‌లేదు.. పాతకాలపు ఆయుధాలు ఈ తరం యుద్ధ అవసరాలకు పనికిరావని భారత్ గమనించాలని సూచించారు . త్రివిద ద‌ళాల్లో మానవ వనరులపరంగా భారత్‌ ముందంజలో ఉంద‌ని కానీ.. పాక్‌ను జెట్ చేసే క్ర‌మంలో మిగ్ కూలిపోయిందంటే ఆయుధాల విష‌యంలో ఇండియా ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు.

అంతేకాదు భారత్ ఆయుధ సంపదలో 68% పాతవే ఉన్నాయని వెల్లడించారు. భారత సైన్యం 21వ శతాబ్దపు యుద్ధాన్ని కూడా దశాబ్దాల క్రితం నాటి ఆయుధాలతో చేయాల్సి వస్తోందని ఆవేదన చెందారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -