నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టాటా ఏస్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో స్పాట్‌లో 7గురు మృతి చెందగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వారిని హైదరాబాద్, దేవరకొండ ఆస్పత్రులకు తరలించారు. హైదరాబాద్ నుంచి దేవరకొండవైపు వస్తున్న టాటాఏస్ వాహనం నాగార్జున సాగర్ హైవేపై కొండపల్లి మండలం చెన్నారం వద్దకు రాగానే వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణీలకులకు కూడా గాయాలయ్యాయి. టైరు పేలడంతో అదుపు తప్పిన టాటా ఏస్ వాహనం.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సుని ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టాటా ఏస్ వాహనం చింతపల్లి గ్రామానికి చెందినదిగా గుర్తించారు. అయితే సమీపంలో ఆసుపత్రులు లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం .మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -