కన్నా… బాత్రూమ్లోకి సెల్ఫోన్ ఎందుకు అంటే ఆ బుడతడు వినలేదు. నీకేం తేలీదు అన్నాడు. చిన్నా బాత్రూమ్లో ఇంకేంత సేపు అంటే పెడచెవిన పెట్టాడు. సుమారు గంటకు పైగా టాయిలెట్లోనే కూర్చుని మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేశాడు. గేమ్ బోర్ కొట్టిందో.. లేక మొబైల్లో ఛార్జ్ అయిపోయిందో తెలీదు కానీ ఇక పైకి లేద్దామనుకునే సరికి లేవలేకపోయాడు. అందులో ఇరుక్కుపోయాడు.
ఈ ఘటన చైనాలో జరిగింది. తాను ఇరుక్కుపోయానన్న విషయం తెలుసుకున్న ఆ పిల్లాడు గట్టిగా కేకలు వేయడంతో చివరకు తల్లి వచ్చి అతడిని బయటకు లాగే ప్రయత్నం చేసింది. పిల్లాడు పూర్తిగా టాయిలెట్ ఇరుక్కుపోవడంతో ఆమె వల్ల కాలేదు. దీంతో వెంటనే అగ్నిమాపక శాఖకు ఫోన్ చేసింది. ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ పిల్లాడిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు.
మొదట చిన్న కత్తితో టాయిలెట్ పై సీటు కట్ చేశారు. ఆ తర్వాత ఇతర వస్తువులు వాడి టాయిలెట్ కమోడ్ను కట్ చేసి పిల్లాడిని బయటకు తీశారు. అయితే, చిన్న చిన్న గాయాలతోనే బుడతడు క్షేమంగా బయటపడ్డాడు. దీంతో ఆ తల్లి ఊపిరిపీల్చుకుంది. కానీ ఈ వీడియో మాత్రం నెట్టింట్లో ఫుల్ వైరల్ అయిపోయింది. మీరు చూడండి.
