Wednesday, May 14, 2025
- Advertisement -

మూడో వ‌న్డేలో ఊపిరి పీల్చుకున్న టీమిండియా….

- Advertisement -

రాంచీలో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో ఆసిస్ జ‌ట్టు భార‌త బౌల‌ర్ల‌కు చుక్కు చూపిస్తోంది. ఓపెన‌ర్లు చెల‌రేగ‌డంతో భారీ స్కోరు దిశ‌గా వెల్తోంది ఆసిస్‌. మొద‌టి వికెట్ తీయ‌డానికి భార‌త్ ఆప‌సోపాలు ప‌డింది. చివ‌ర‌కు మొద‌టి వికెట్ తీసింది టీమిండియా. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓపెన‌ర్లు 193 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.ఓపెనర్ అరోన్ ఫించ్ 93 (99 బంతుల్లో ; 10 ఫోర్లు, 3 సిక్సులు) అవుట్ అయ్యాడు. కుల్దీప్ వేసిన 32వ ఓవర్ ఐదో బంతికి ఫించ్ ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి ఆసీస్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేయాలని కోహ్లీసేన ఆశిస్తోంది. ఓపెనర్లు స్పిన్, పేస్ బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొంటూ జట్టును పటిష్ఠస్థితిలో నిలిపారు. 36 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 216 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా(99), గ్లెన్ మాక్స్‌వెల్(16) క్రీజులో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -