ఎన్నిక‌ల్లో పోటీచేయ‌డంపై క్లారిటీ ఇచ్చిన ఆంధ్రా ఆక్టోప‌స్‌..

త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపునుంచి పోటీ చేస్తార‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై ల‌గ‌డ‌పాటి రాజ‌క‌గోపాల్ స్పందించారు. తాను పోటీ చేస్తాన‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజంలేద‌న్నారు. నర్సరావుపేటతో సహా ఏ నియోజకవర్గంపైనా తాను చర్చలు జరపలేదని, ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తాను ఎవరితోనూ చర్చించలేదని చెప్పారు. తాను అస‌లు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయనంటూనే.. తనను పోటీ చేయమంటూ తన అనుచరులు, సహచరుల నుంచి ఒత్తిడి వస్తున్నట్టు లగడపాటి చెప్పడం గ‌మ‌న్హం