బాలీవుడ్ హీరోయిన్స్ ఈ మధ్య పెళ్లిపై మనస్సు మళ్లినట్లుంది. అందరు పెళ్లికి రెడీ అంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, దీపిక పదుకునే, సోనమ్ కపూర్ వంటి వారు పెళ్లి చేసుకుని తమ వైవాహిక జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ పెళ్లికి రెడీ అయిందని తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుందని
తెలుస్తోంది. గతకొంతకాలంగా ఈ బ్యూటీ రోహన్ శ్రేష్ట అనే ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేస్తుందట.చాలాకాలం నుంచి అతడితో ఎఫైర్ సాగిస్తుందట శ్రద్ధా. ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడంతో ఈ జంట పెళ్లికి రెడీ అయ్యారని తెలుస్తుంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించినట్లు సమాచారం.
ఇప్పటికే శ్రద్ధా ఇంట్లో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారట. ఆమె పెళ్లి చేసుకునే వయస్సు దాటిపోతుందని వారు ఆమెను పెళ్లికి రెడీ అవుతున్నారట. శ్రద్ధా కపూర్ కపూర్ వయస్సు ప్రస్తుతం 32. ఆమె వయస్సులో ఉన్న హీరోయిన్స్ అందరు పెళ్లి చేసుకున్నారు. అయితే శ్రద్దా మరో రెండు సంవత్సరాలు తరువాత పెళ్లి చేసుకుందమని భావిస్తుందట. ఆమె చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో కలిసి సాహో సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో ‘చిచ్చోరే’, ‘ఏబీసీడీ 3’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు పూర్తి అయిన వెంటనే పెళ్లి చేసుకుంటుంట శ్రద్ధా.
- Advertisement -
పెళ్లికి రెడీ అయిన ప్రభాస్ హీరోయిన్, పెళ్లి కొడుకు అతనేనా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -