ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపడతామో వివరిస్తూనె…ప్రభుత్వ వైఫల్యాలపై బాబును ఎండగడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో జరిగిన బహిరంగ సభలో బాబుపై జగన్ నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా కోసం పారాడితే బాబు తనపై 22 కేసులు పెట్టించాడని ధ్వజమెత్తారు. తన పార్టనర్ పవన్ పై మాత్రం ఎలాంటి కేసులు లేవన్నారు.
పవణ్ ఒ యాక్టర్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబు మీద ప్రజావ్యతిరేకత ఉండటంతో ఏపార్టీకూడా పొత్తు పెట్టుకొనేందుకు ముందుకు రావడంలేదన్నారు. అందికే చివరకు పెయిడ్ యాక్టర్, చంద్రబాబు పార్ట్‌నర్ కూడా డైరెక్ట్‌గా పొత్తు పెట్టుకోవడానికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బాబు చెప్తున్న మాటలు ప్రజలు నమ్మడంలదని అందుకే జాతీయ నాయకులను ఇక్కడికి రప్పించి విమర్శలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.