బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్ మీద మోజుతోనే ప్రియాంక బాలీవుడ్లో సినిమాలు చేయడం మానేసింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న భరత్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్‌ను వదులుకుంది ప్రియాంక చోప్రా. అలాంటి ప్రియాంక చోప్రాను హత్య చేసేందుకు ప్లాన్ చేశారట ఎంటీవీ రోడీస్ కి చెందిన ఒక కంటెస్టంట్. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఇటీవల రోడీస్ షోకి ఆడిషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తోంది హీరోయిన్ నేహా ధూపియా. రోడీస్ పాల్గొన్న సారంగ్ తన దరఖాస్తులో ప్రియాంకా చోప్రాని చంపేయాలనుకుంటున్నట్లు రాశాడు.
అది చూసిన నేహా ఎందుకు అలా అనుకుంటున్నావని కంటెస్టంట్ సారంగ్‌ని ప్రశ్నించింది. గతంలో ప్రియాంక మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిందని మేము రిహార్సల్స్ చేసిన తరువాత చివరి నిమిషంలో స్టెప్స్ మార్చేసేదని చెప్పుకొచ్చాడు సారంగ్. కొన్ని డిమాండ్లతో పాటు లంచ్ బ్రేక్ కూడా లేకుండా ఉదయం నుండి ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేదని, ఆమె వల్ల చెప్పుకొలేని బాధలు పడ్డామని చెప్పుకొచ్చాడు సారంగ్. ఇది విన్న తరువాత ప్రియాంక చోప్రా వ్యక్తిత్వం ఇలాంటిదా అని బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు.
- Advertisement -
ప్రియాంక చోప్రాను చంపాడానికి ప్లాన్ వేశారా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -