నటుడు,జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎర్టీ తరుపున ఆయన ఒక్కడే స్టార్ క్యాంపైనర్ కావడంతో అన్ని నియోజిక వర్గాలను కవర్ చేయలేకపోతున్నారు.తాజాగా
దీనిపై ఓ వార్త బయటికి వచ్చింది. పవన్‌కు మద్దుతుగా మెగా హీరోలు ఎంట్రీ ఇవ్వనున్నారని ఆ వార్తల సారాంశం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పవన్ జనసేన పార్టీ తరుపున ప్రచారం నిర్వహించనున్నారని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా దీనిపై స్పందించాడు పవన్ కల్యాణ్. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్, బన్నిల గురించి అడగ్గా, ఇది మీరు చెబితేనే నాకు తెలిసిందని తెలిపాడు పవన్ కల్యాణ్.
వారిని స్పెషల్‌గా పాలిటిక్స్‌లోకి పిలిచి ఇక్కడి వాతావరణంలో రుద్దాలని అనుకోవడం లేదు. కుటుంబ రాజకీయాలకు తాను వ్యతిరేకం అని, తన అన్నయ్య నాగబాబుని కూడా రాజాకీయాల్లోకి తీసుకురావండ తనకు ఇష్టం లేదని కాని ఏదో అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చాడు పవన్ కల్యాణ్.ఒకేసారి సినిమాలు పాలిటిక్స్ అంటే కష్టం. చరణ్ ఒక సందర్భంలో పార్టీ తరుపున ప్రచారం చేస్తాననడం నేను కూడా విన్నానని తెలిపారు. అయితే చరణ్ నా ముందు అనలేదని, నా ముందు చెప్పి ఉంటే అప్పుడే ఈ విషయంపై క్లారిటీ
ఇచ్చేవాడినని ,వారి జాబ్ వారు చేసుకోవడం బెటర్ అని పవన్ క్లియర్ గా చెప్పేశాడు. పవన్ వ్యాఖ్యలతో బన్నీ ,చరణ్‌లు పార్టీ తరుపున ప్రచారం చేయడం లేదనేది అర్ధం చేసుకోవచ్చు.
- Advertisement -
చరణ్ , బన్ని ఎన్నికల ప్రచారంపై స్పందించిన పవన్ కల్యాణ్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -