ఎన్నికల వేళ కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రఖ్యాత సెర్చ్ ఇంజైన్ గూగుల్‌లో మన రాజకీయ నాయకుల పేర్లు మారుమోగుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కడంతో నెట్టింట్లో కూడా పొలిటికల్ హవా సాగిస్తోంది. మిగతా విషయాలకంటే ఇప్పుడు రాజకీయం గురించి ఎక్కువగా వెతుకుతున్నారట నెటిజన్లు. ఏపీలో ఉన్నంత రాజకీయ వాతావరణం మరే రాష్ట్రంలో లేదని దీనిని బట్టి తెలుస్తోంది. ఇక అసలు విషయమేమిటంటే గూగుల్ సెర్చ్ ఇంజైన్‌లో ఎక్కువగా వెతికిన పేర్లలో జగన్ అగ్రస్థానంలో ఉండడం విశేషం. అధికార పార్టీ చంద్రబాబునాయుడు కంటే జగన్ గురించే నెటిజన్లు ఎక్కువగా వెతికారట.
మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగుతున్న వేళ.. రాత్రనక పగలనక పార్టీ అధినేతలు ప్రచార వేడిని తీవ్రంగా పెంచాయి. తమ మాటలు, హామీలతో జనాలను ఆట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో నెటిజన్లు కూడా ఏపీ రాజకీయం గురించి తీవ్రంగా సెర్చ్ చేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పొజిషన్ ఎలా ఉంది..? అక్కడ ఏం జరుగుతోందోనని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తురాట.
మార్చి 2 నుంచి 22 వరకు రాజకీయ నేతల ట్రెండ్స్‌ను గూగుల్ ఇటీవల విడుదల చేసింది. వీటిలో ఎక్కువగా వైసీపీ అధినతే జగన్ గురించి 100 శాతం మంది వెతకగా, టీడీపీ నేత చంద్రబాబు గురించి 25 శాతం మంది మాత్రమే వెతికారట. ఓ వైపు సినీగ్లామరంతా వైపీపీ జెండా పట్టుకోవడంతో పాటు ప్రముఖులంతా ఫ్యాన్ కిందకు వెళుతున్నారు. ఈ తరుణంలో నెట్టింట్లో కూడా ఫ్యాన్ గాలి తిరగడం వైసీపీకి కలిసొచ్చే అంశం. చంద్రబాబు సంక్షేమ పథకాలు, తదితర అడ్వర్టయిజ్‌మెంట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా ఓవరాల్‌గా మాత్రం జగన్‌కే ఫుల్ సపోర్టు ఉన్నట్లు వాతావరణం కనిపిస్తోంది.