హీరో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరికొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అటు అధికార టీడీపీ పార్టీ తరుపున సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేశ్, బాలయ్య వంటి వారు పార్టీ తరుపున ప్రచారం చేస్తున్నారు. అలాగే ప్రతిపక్ష వైసీపీ తరుపున పార్టీ అధినేత జగన్‌తో పాటు విజయమ్మ, షర్మిల మొదలగు వారు ప్రచారం నిర్వహిస్తున్నారు.కాని జనసేన తరుపున పవన్ ఒక్కడే ప్రచారం నిర్విహించడం వల్ల అన్ని నియోజిక వర్గాలను కవర్ చేయలేకపోతున్నారు.
ఈ విషయంలో బాబాయ్‌కు అండగా అబ్బాయ్ రంగంలోకి దిగాడు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేన తరుపున సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి రెడీ అయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. జనసేనకి మద్దతుగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి అభిమానులను ఆకట్టుకున్నాడు. పవన్ కల్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోపై స్పందించాడు రామ్ చరణ్. అధ్బుతమైన మేనిఫెస్టో.. సమాజంలోని అన్ని విభాగాలకు సమ న్యాయం చేస్తోంది. రాజకీయాల్లో ఇదొక సరికొత్త పంథా. కళ్యాణ్ బాబాయ్ కి కంగ్రాట్స్ అంటూ ట్విట్ చేశాడు రామ్ చరణ్.
- Advertisement -
బాబాయ్ కోసం అబ్బాయ్ సోషల్ మీడియా ప్రచారం
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
