Monday, May 6, 2024
- Advertisement -

వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌కోసం రాజ‌కీయ పార్టీలు ఎన్నికోట్లు ఖ‌ర్చు చేశాయే తెలుసా..?

- Advertisement -

దేశ వ్యాప్తంగా త‌మ పార్టీ త‌రుపున ప్ర‌చారంకోసం యాడ్స్ రూపంలో భారీగా ఖ‌ర్చుచేస్తున్నారు. ఒక వైపు ఇంటింటికి తిరిగి ప్రాచారం చేస్తూనె సామాజిక మాధ్య‌మాలతోపాటు ఆన్ లైన్‌లో కూడా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. గూగుల్ లో ఎక్కడ చూసినా ఫలానా గుర్తుకే ఓటేయండి అంటూ యాడ్స్ దర్శనమిస్తున్నాయి. యూట్యూబ్ లోనూ యాడ్స్ తో హోరెత్తిస్తున్నారు. రాజకీయ పార్టీలు తమ ప్రచారం కోసం ఫిబ్రవరి 19 నుంచి ఏ పార్టీ ఎంత ఖర్చు చేశాయో ఓ నివేదిక‌ను గురువారం నాడు గూగుల్ విడుదల చేసింది.గూగుల్‌లో ఇప్పటికే 831 యాడ్స్‌ కోసం అన్ని రాజకీయ పార్టీలు రూ.37 కోట్లను ఖర్చు పెట్టాయి.

గూగుల్ నివేదిక ప్ర‌కారం దేశంలో భాజాపా 554 యాడ్స్‌ కోసం రూ. 1.21 కోట్లను ఖర్చు చేసినట్టుగా గూగుల్ ప్రకటించింది. .బీజేపీకి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 14 యాడ్స్ కోసం రూ. 54,100 ఖర్చు చేసింది. బీజేపీ తర్వాతి స్థానంలో వైసీపీ నిలిచింది. భాజాపా త‌రువాత రెండో స్థానంలో వైసీపీ 107 యాడ్స్ కోసం రూ.1.04 కోట్లను ఖర్చు చేసింది. మరో యాడ్స్ సంస్థ కూడ 43 యాడ్స్‌పై రూ. 26,400లను ఖర్చు చేసినట్టుగా గూగుల్ ప్రకటించింది.

టీడీపీ గూగుల్‌లో యాడ్స్ ఇవ్వడంలో నాలుగో స్థానంలో నిలిచినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది.ప్రమన్యా స్ట్రాటజీ కన్సల్టింగ్ సంస్థ 53 యాడ్స్ కోసం రూ.85.25 లక్షలను ఖర్చు చేసినట్టుగా గూగుల్ ప్రకటించింది. 36 యాడ్స్ కోసం డిజిటల్ కన్సల్టింగ్ సంస్థ రూ.63.43 లక్షలను కేటాయించినట్టుగా తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి గూగుల్‌కు ఎక్కువ యాడ్స్ వ‌చ్చిన‌ట్లు గూగుల్ ప్ర‌క‌టించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -