- Advertisement -

ప్రభాస్‌కు అస‌లు ఏమైంది..?

- Advertisement -

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గురించి చెప్ప‌లంటే బాహుబ‌లి ముందు బాహుబ‌లి త‌రువాత అని వేరు చేసి చెప్పాలి. బాహుబ‌లికి ముందు ప్ర‌భాస్ రేంజ్ వేరు, బాహుబ‌లి త‌రువాత ప్ర‌భాస్ రేంజ్ వేరు. బాహుబ‌లి త‌రువాత ప్ర‌భాస్ న‌టిస్తున్న సినిమా సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజిత్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 250 కోట్ల భారీ బడ్టెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. సినిమా సంగ‌తి ప‌క్క‌న పెడితే ప్ర‌భాస్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

ప్ర‌భాస్ ఫోటోల్లో మునుపటి గ్లామర్ కానీ చురుకు కానీ ఎక్క‌డ క‌నిపించ‌డం లేదు. ప్రభాస్ కాస్తా ఒళ్ళు చేసి క‌నిపిస్తున్నాడు. ప్ర‌భాస్ ఫోటోల‌ను చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అస‌లు ప్రభాస్‌కు ఏమైంది, ఇలా మారిపోతున్నాండేంటి అని ఫ్యాన్స్ తెగ బాధ‌ప‌డిపోతున్నారు. డార్లింగ్‌, మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ సినిమాల్లో ప్ర‌భాస్ చాలా గ్లామ‌ర్‌గా క‌నిపించాడు. ఆ గ్లామ‌ర్ ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌లో ఎక్క‌డ క‌నిపించ‌డం లేదు. ఇది ఇలా కొన‌సాగితే ప్రభాస్‌ను చూడ‌టం క‌ష్ట‌మ‌నే భావ‌న అందరిలోను క‌లుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -