తమన్నా , ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన సినిమా దేవి. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో అభినేత్రిగా అనువదించారు. తమిళం విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో పెద్దగా రాణించలేదు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించారు. ‘అభినేత్రి 2’ పేరుతో రూపొందించిన ఈ సినిమాకు ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహించారు.సీక్వెల్‌లో కూడా ప్రభుదేవా, తమన్నాలే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
మొదటి భాగంలాగానే సీక్వెల్ కూడా హర్రర్, కామెడీ ప్రధానంగా చేసుకుని తెరకెక్కించినట్లు టీజర్‌ను చూస్తుంటే అర్థం అవుతోంది. ప్రభుదేవా,తమన్నా, నందిత శ్వేత ,కోవై సరళకి సంబంధించిన ఆసక్తికరమైన సన్నివేశాలపై ఈ టీజర్‌ను కట్ చేశారు. తమన్నా ఈ సినిమాలో దెయ్యంగా కనిపించనుంది.ఒక దెయ్యం కాదయ్యా .. రెండు దెయ్యాలు’ అని కోవై సరళ చెప్పడం, ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక సినిమాను మే1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటి పార్ట్ సూపర్ హిట్ అయినట్లుగానే రెండో పార్ట్ కూడా ఘన విజయం సాధిస్తుందేమో చూడాలి.
- Advertisement -
ఆసక్తిని పెంచుతున్న ‘అభినేత్రి 2’ టీజర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -