స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన బాయ్‌ఫ్రెండ్ అయిన మైఖెల్ కోర్సేల్‌కు బ్రేకప్ చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శృతి హాసన్. తక్కువ కాలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతి హాసన్. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా మారింది. కెరీర్ ఉన్నత దశలోనే ఉన్నప్పుడే లండన్ థియేటర్ ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సేల్‌తో ప్రేమలో పడింది శృతి.
ఇద్దరు కలిసి తెగ ఎంజాయ్ చేశారు. ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మైఖెల్ కోర్సేల్ కారణంగా శృతి సినిమాలకు దూరం అయింది. శృతి సినిమాల్లో నటించి దాదాపు సంవత్సరం దాటింది. ఇక వీరిద్దరి పెళ్లే తరువాయి అనుకున్న సమయంలో వీరి ప్రేమకు బ్రేకులు పడ్డాయి. గత కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్న ఇద్దరూ ఇప్పుడు బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన మైఖేల్, జీవితం తామిద్దరినీ వ్యతిరేక మార్గాల్లో ఉంచిందని అనడం విశేషం.
తమ మధ్య ఎటువంటి గొడవలు లేవని స్పష్టం చేశాడు మైఖెల్. ఇద్దరు కలిసి జీవించలేమని, అందుకే విడిపోయామని తెలిపాడు. 2016లో లండన్ కు వెళ్లిన శ్రుతికి మైఖేల్ పరిచయం కాగా, వీరిద్దరి మధ్యా మొదలైన స్నేహం ప్రేమగా మారింది. మైఖేల్ కోసం నెలకోసారైనా శ్రుతి లండన్ వెళ్లి వస్తుండేది. మరి బ్రేకప్‌పై శృతి హాసన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
- Advertisement -
శృతి హాసన్‌తో కలిసి జీవించలేను – ప్రియుడు మైఖెల్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -
