Wednesday, May 1, 2024
- Advertisement -

రాష్ట్రానికి ముంచుకొస్తున్న మ‌రో తుఫాన్‌..వ‌ణికిపోతున్న తీర ప్రాంత ప్ర‌జ‌లు

- Advertisement -

వేస‌వి కాలంలో తొలిసారి హిందూ మహా సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది కొద్ది స‌మ‌యంలోనే తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది శనివారం నాటికి తుఫాన్‌గా మారనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తుఫాన్‌గా మారిన తర్వాత 72 గంటలు శ్రీలంక తూర్పు తీర ప్రాంతం వెంబడి వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 30వ తేదీన ఉత్తర తమిళనాడు–దక్షిణ కోస్తాంధ్రల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాత‌వార‌ణ శాఖ అంచనా వేస్తోంది.

ఈ తుఫాన్‌కి ‘ఫ‌ణి’ అని నామాక‌ర‌ణం చేశారు. తుపానుగా మారిన తర్వాత 72 గంటలు శ్రీలంక తూర్పు తీర ప్రాంతం వెంబడి వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 30వ తేదీన ఉత్తర తమిళనాడు–దక్షిణ కోస్తాంధ్రల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాత‌వార‌ణ శాఖ అంచనా వేస్తోంది. మొద‌ట ‘ఫ‌ణి’ తుఫాన్ త‌మిళ‌నాడు వ‌ద్ద తీరం దాటుంద‌ని అంచ‌నా వేశారు. అయితే ఇప్పుడు ఈ తుఫాన్ త‌న దిశ‌ను మార్చుకుంద‌ని తెలుస్తోంది. క‌న్యాకుమారి వ‌ద్ద ఈ తుఫాన్ తీరం దాటనుంద‌ని స‌మాచారం. మారిన పరిస్థితులనేపథ్యంలో ఇది శ్రీలంక తూర్పు తీరం వెంబడి వాయవ్య దిశగా పయనించి దక్షిణ కోస్తాంధ్ర–ఉత్తర తమిళనాడు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.

ఈ తుఫాన్ ప్ర‌భావం తీవ్రంగా ఉండ‌నుంద‌ని వాత‌వార‌ణ శాఖ తెలిపింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. భారీ ఈదురుగాలులూ వీస్తాయి. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయ‌ని విశాఖపట్నం వాత‌వార‌ణ శాఖ ఓ ప్ర‌క‌ట‌న ద్వారా తెలియ‌జేసింది. ఫ‌ణి తుఫాన్ ప్ర‌భావం తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో క‌నిపించ‌నుంది. దీంతో తీర ప్రాంత ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. తుఫాన్ తీవ్రంగా ఉండే చోట ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించే ప‌నిలో ప‌డ్డారు అధికారులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -