ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు అజయ్ భూపతి. అతను దర్శకత్వం వహించిన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఓ యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. బొల్డ్ సీన్స్ కూడా సినిమా విజయానికి దోహదపడ్డాయి. అయితే ఈ సినిమా విడుదల అయి 8 నెలలు కావస్తున్న మరో సినిమా మొదలుపెట్టలేదు అజయ్ భుపతి.
దీంతో అతనిపై సోషల్ మీడియాలో రకరకాలు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై కాస్తా అసహనం వ్యక్తం చేశాడు అజయ్ భుపతి. నాగచైతన్య-సమంత కాంబినేషన్లో సినిమా చేస్తున్నాడని కొందరు, అదేమీ కాదు రవితేజతో సినిమా చెయ్యబోతున్నారు మరికొందరు వార్తలు రాస్తున్నారు. ఈ వార్తలను చూసిన అజయ్ భూపతి ట్విట్టర్ లో తన అసహనం వ్యక్తం చేసారు. “నా రెండో సినిమా ఎప్పుడు, ఎవరితో, ఎలా తియ్యాలో నాకు తెలుసు ప్లీజ్ స్టాప్ రూమర్స్ ,” అంటూ పోస్ట్ చేసారు.
మొదటి సినిమాతోనే ఘన విజయం సాధించిన డైరెక్టర్ ఇంకా రెండో సినిమా మొదలుపెట్టకపోతే ఇలాంటి వార్తలే వస్తుంటాయి అని అజయ్ భూపతి ఎప్పుడు తెలుసుకుంటాడో చూడాలి. ఈ దర్శకుడికి తరువాత ప్రాజెక్టు అంత సులువుగా సెట్ కావడంలేదు. పెద్ద పెద్ద బ్యానర్లు, రామ్, నితిన్,బెల్లంకొండ శ్రీను హీరోల పేర్లు వినిపించినా ఏదీ సెట్ కూడా కావడం లేదు. అందుకే అజయ్ మీడియా తన అసహనాన్ని ప్రదర్శించి ఉంటాడని అతని సన్నిహితులు చెబుతున్నారు.
