టెక్నాలిజీతో పాటు మనుషుల మనుస్సులు కూడా అదే వేగంగా మారుతున్నాయి. గతంలో శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడాలి అంటేనే తెగ సిగ్గుతో తల దించుకునే వారు. ఇక మహిళలు అయితే వేరేగా చెప్పాలా..? తమ భర్తలతో సైతం తమ కోరికల గురించి చెప్పాలంటే భయపడేవారు. కొద్ది రోజులకి పురుషులతో సమానంగా స్త్రీలు కూడా సెక్స్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు అయితే పూర్తి విరుద్ధంగా ఉంది. పురుషులతో పాటు స్త్రీలు కూడా పెళ్లికి ముందే శృంగార అనుభవాన్ని పొందుతున్నారు. తాజాగా చేయించిన ఓ సర్వేలో ఓ షాకింగ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది.
ఇటు అబ్బాయిలు కాని అమ్మాయిలు కాని తమతో పరిచియం లేని వారితో సెక్స్ చేయడానికి ఇష్టపడుతున్నారని ఓ సర్వేలో వెల్లడయింది. దీనికి కారణం లేకపోలేదు. అదే తెలిసిన వారి అయితే తరువాత చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తామని, తెలియని వారు అయితే పని అయిపోగానే మరోసారి అతన్ని కాని , ఆమెను కాని కలిసే అవకాశం ఉండదని ఈ ఆలోచన చేస్తున్నారట నేటి యువత. ఇలా పెళ్లికి ముందే అన్ని ముందే కానిచ్చేస్తున్న యువత రేపు తమ పిల్లలకు ఏం నేర్పిస్తారో చూడాలి. దీని గురించి అడిగితే తమకు వచ్చే భాగస్వామి వర్జిన్ అని ఫ్రూఫ్ ఏంటని వారు అడుగుతున్నారు. ఇది కూడా నిజమే కదా..?