Friday, May 17, 2024
- Advertisement -

శ్రీకాకుళంలో పేలిన నాటుబాంబులు…..? 9 మందికి తీవ్ర గాయాలు

- Advertisement -

శ్రీకాకుళం జిల్లా యాతపేటలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. పేలుడు ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు.జిల్లా ఎచ్చెర్ల మండలం యాతపేటలోని ఓఇంట్లో ఉంచిన నాటుబాంబులు పేలాయి. పేలుడు ధాటికి జనావాసాలు మధ్య ఉన్న ఇళ్లు కుప్పకూలింది. పరిసరాల్లోని మరో నాలుగైదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నాటు బాంబులు త‌యారు చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న సంభ‌వించిన‌ట్లు స‌మాచారం.

తొలుత ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ పేలిందని భావించారు. కానీ అగ్నిమాపక సిబ్బంది ఇంట్లో పరిశీలించిన తర్వాత బాంబు పేలుడు వల్లే ఈ ఘటన చోటు చేసుకొందని అధికారులు నిర్ధారించారు. రమణ అనే వ్యక్తి పందుల‌ను వేటాడం కోసం ఈ బాంబులు తయారు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ ఇంట్లో నివసిస్తున్నవారికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -