- Advertisement -

మూడు క‌ళ్ల‌ పామును ఎప్పుడైనా చూశారా….?

- Advertisement -

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం రెండు త‌ల‌ల పామును చూశాం. కాని ఇప్ప‌టి వ‌ర‌కు మూళ్లున్న పామును చూసిన దాఖ‌లాలు లేవు. ఇలాంటి అరుదైన పామును ఆస్ట్రేలియాలో ని అర్న్‌‌హెమ్ హైవేపై గుర్తించారు. నార్తర్న్ టెరిటరీ పార్క్స్ అండ్ వైల్డ్‌లైఫ్ ఈ మూడు కళ్ల పాము ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయ్యింది.

కార్పెట్ పైథాన్ అని పిలిచే ఈ పామును మార్చి నెలలో గుర్తించారు. పిండం ఏర్ప‌డే ద‌శ‌లో జ‌న్యుప‌ర‌మైన సంబంధ ల‌క్ష‌ణాల‌తో మూ డో క‌న్ను ఏర్ప‌డి ఉండ‌వ‌చ్చ‌ని నిపునులు భావిస్తున్నారు.సహజమైన జన్యు పరివర్తనతో జన్మించిందని భావిస్తోన్న ఈ పాముకు తల పైభాగంలో ఉన్న మూడో కన్ను కూడా పని చేస్తున్న విషయాన్ని వైల్డ్‌లైఫ్ అధికారులు గుర్తించారు. అయితే అది ఆహారం తీసుకోవ‌డంతో ఇబ్బందులు త‌లెత్త‌డంతో ఈ పాము గత వారం చనిపోయింది. అరుదైన లోపంతో జన్మించినప్పటికీ ఈ పాము ఎక్కువ కాలమే బతికిందని రేంజర్ రే చాటో తెలిపారు.

https://www.facebook.com/ParksandWildlifeNT/posts/2284844224909161

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -