జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కోశాధికారి మర్రి రాఘవయ్య పార్టీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గురువారం జనసేన అధినేత పవన్‌కు పంపించారు.వ్యక్తిగత కారణాలతో పార్టీలోని అన్ని పదవులను వదులుకుంటున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. టీడీపీతో జనసేన రహస్య సంబంధాలు నచ్చకే పార్టీని రాఘవయ్య వీడినట్టు జనసేనలో ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు మరో నేత కూడా రాజీనామా చేసినట్లు సమాచారం. ఫలితాలు రాకముందె నాయకులు పార్టీని వీడటం జనసేనను కలవర వపరుస్తోంది. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను కాదని కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వడంతోనె సీనియర్ నేతలు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ అధికార ప్రతినిధి శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడే ఇలా ఉంటె ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి ఏంటన్నది నేతల్లో అయోమయం నెలకొంది. మరి దీనిపై పవన్ స్పందిస్తె పార్టీ శ్రేణులు కొంత ధైర్యంగా ఉండనున్నాయి.
- Advertisement -
జనసేనకు బిగ్ షాక్…పార్టీ కోశాధికారి పదవికి రాజీనామా చేసిన రాఘవయ్య
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
