Wednesday, May 1, 2024
- Advertisement -

స్వల్ప గాయాలతో బయటపడ్డ నటుడు

- Advertisement -

తెలుగులో ఆర్జే గా హేమంత్ బాగానే పాపులర్ అయ్యాడు. తాజాగా హేమంత్ కు యాక్సిడెంట్ అయ్యి స్వల్ప గాయాలతో బయటపడ్డాడని తెలుస్తోంది. ఈ ఘటన ఏపీ లోని కృష్ణా జిల్లాలో జరిగింది. ‘మహర్షి’ సినిమాలో చిన్న పాత్ర పోషించిన హేమంత్ సినిమా సక్సెస్ మీట్ అయిపోగానే అక్కడినుండి కారులో బయల్దేరాడు. కృష్ణా జిల్లా జగ్గయ్య పేటకు సమీపంలో ఉన్నప్పుడు కార్ కి ఆక్సిడెంట్ అయ్యింది.

ఎదురుగా వస్తున్న గేదెను తప్పించబోయి అదుపుతప్పిన కారు పల్టీలు కొట్టింది.అయితే, హేమంత్ స్వల్ప గాయాలతో తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డాడు. ఇంకా ఈ ఆక్సిడెంట్ గురించిన కొన్ని విషయాలు బయటకి రావాల్సి ఉంది. తాజాగా విడుదలైన అడల్ట్ కామెడీ ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాలో కూడా నటించాడు హేమంత్. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఈ టీవి లో ఒక పాపులర్ డాన్స్ షో ‘ఢీ’ కి టీమ్ లీడర్ గా కూడా వ్యవహరించాడు హేమంత్. అలాగే ప్రస్తుతం కొన్ని కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ పలు సినిమాలలో చిన్న పాత్రలు పోషిస్తున్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -