Saturday, April 27, 2024
- Advertisement -

దళపతి గా మారనున్న శర్వా

- Advertisement -

శర్వానంద్ హీరో గా సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక గ్యాంగ్స్టర్ డ్రామా చాలా రోజుల క్రితమే మొదలు అయింది. అప్పుడెపపుడో షూటింగ్ మొదలు అయ్యి దాదాపు గా 90 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్లకి సంబందించిన షూటింగ్ పూర్తి కాగా కొద్దిగా ప్యాచ్ వర్క్ మిగిలి ఉన్నట్లు గా తెలుస్తుంది.

సినిమా యూనిట్ ఈ చిత్రాన్ని జూలై లో విడుదల చేద్దాం అనుకుంటున్న తరుణం లో ఈ సినిమా కి టైటిల్ పెట్టి ప్రచారాన్ని మొదలు పెట్టాలి అనే ఆలోచన లో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పై చాలా రూమర్స్ వచ్చినప్పటికీ తాజా సమాచరం మేరకు దళపతి అనే టైటిల్ ని ఈ సినిమా కి అనుకుంటున్నారట దర్శక నిర్మాతలు. మణిరత్నం దర్శకత్వం లో అప్పట్లో వచ్చిన దళపతి చాలా పెద్ద సక్సెస్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. అదే రేంజ్ లో ఈ సినిమా కూడా శర్వానంద్ కెరీర్ ని ఒక మలుపు తిప్పే చిత్రం లా మారుతుంది అని దర్శక నిర్మాతలు ఆశిస్తున్నారు. దళపతి అనే టైటిల్ కూడా ఈ సినిమా కి చాలా యాప్ట్ గా ఉంటుంది అని అందుకే ఆ టైటిల్ తో ముందుకి వెళ్ళాలి అనే ఆలోచనని కూడా వ్యక్త పరుస్తున్నారు.

సితార ఎంటర్టైనమెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -