Sunday, May 5, 2024
- Advertisement -

సరికొత్త అవతారంలో అలరించబోతున్న అమల

- Advertisement -

తమిళ దర్శకుడి ని ప్రేమించి పెళ్లాడిన అతనితో విడాకులు తీసుకున్న తర్వాత నుంచి హాట్ బ్యూటీ అమలాపాల్ తన కెరీర్ మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఒకవైపు హాట్ పోజులతో సోషల్ మీడియాను వేడెక్కిస్తున్న ఈ భామ మరోవైపు సినిమాలతో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే తాజాగా అమలాపాల్ నటిస్తున్న తదుపరి సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మేయదాన్ మాన్ దర్శకత్వం లో అమలాపాల్ ‘ఆడయ్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

అర్థనగ్నంగా ఒంటినిండా దెబ్బలతో ఉన్న అమలాపాల్ చేతిలో ఒక ఆయుధంతో గట్టిగా అరుస్తూ ఫోటోకి ఫోజు ఇచ్చింది. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ఈ మధ్యనే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏ సర్టిఫికెట్ తో బయటకు వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా విడుదల తేదీ ఖరారు కానీ ఈ చిత్రం సక్సెస్ అమలాపాల్ కెరీర్ కి కీలకంగా మారబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -