Tuesday, April 30, 2024
- Advertisement -

ఏడిపించింది చాలట.. ఇక నవ్విస్తుందట..

- Advertisement -

సమంత అక్కినేని ప్రస్తుతం ఓ బేబీ అనే సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ లో బిజీ గ గడుపుతుంది. ఈ సినిమా సమంత కి చాలా స్పెషల్. ఎప్పటి నుండో ఈ సినిమా ని పట్టాలు ఎక్కించాలి అని చూస్తున్న సమంత మొత్తానికి ఈ సినిమా ని ఇప్పుడు పూర్తి చేసి విడుదల చేసే స్టేజికి తీసుకొని వచ్చింది. ఇకపోతే ఈ సినిమా గురించి సమంత చాలా ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతూ వచ్చింది.

ఇటీవలే మాట్లాడుతూ సమంత ఒక విచిత్రమైన కోరిక ని బయట పెట్టింది. సమంత తన సినిమాల్లో చాలా వేరియేషన్స్ చూపించింది. విభిన్న పాత్రలని కూడా పోషించింది. తన నటన తో కన్నీళ్లు కూడా పెట్టించింది అయితే ఇక పై నవ్వించాలి అని చూస్తుంది అట. ఒక ఫుల్ లెన్త్ కామెడీ కారెక్టర్ ని ఎంచుకొని పూర్తి స్థాయి కామెడీ సినిమా చేయాలనీ సమంత అనుకుంటుంది అని సమాచారం. ఓ బేబీ సినిమా చేస్తూ నే కామెడీ చేయడం సమంత నేర్చుకుంది అని తెలుస్తుంది.

ఒకవేళ తాను రిటైర్ అయితే మాత్రం రిటైర్ ఆయె ముందు కచ్చితంగా ఈ సినిమా మాత్రం చేస్తాను అని సమంత ఇటీవలే ప్రకటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -