- Advertisement -

కొద్ది సేపు గోవా విమానాశ్రం మూసివేత‌..

- Advertisement -

కొద్ది సేపు గోవా విమానాశ్రయం తాత్కాలికంగా మూత ప‌డింది.విమానాశ్రయం నుంచి యుద్ధ విమానం మిగ్-29కే టేకాఫ్ అవుతున్న సమయంలో… దానికి ఉన్న ప్యూయ‌ల్ ట్యాంక్ విడిపోయి రన్‌వేపై పడి అగ్నిప్రమాదం సంభవించింది.అందులో ఉన్న ఇంధనం మండటంలో విమానాశ్రయంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాన్ని కొన్ని గంటల సేపు తాత్కాలికంగా మూసివేశారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇండియన్‌ నేవీ ట్వీట్‌ చేసింది. ఫ్యూయల్‌ ట్యాంక్‌ విడిపోయిన మిగ్‌-29కె ఫైటర్‌ విమానం సురక్షితంగా ఉంది. మిషన్‌ రిక్రూట్‌మెంట్స్‌ నిమిత్తం ఫైటర్‌ జెట్స్‌ తరచుగా ఫ్యూయల్‌ ట్యాంక్‌ను మోసుకెళ్తుంటాయి. తగు చర్యల అనంతరం విమాన రాకపోకలను తిరిగి పునరుద్ధరించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -