Sunday, May 19, 2024
- Advertisement -

నాగబాబు, రోజా.. ఈరోజు సర్ ప్రైజ్ ఇదే..

- Advertisement -

నవతరం పొలిటికల్ నాయకులు.. జబర్ధస్త్ జడ్జీల జోడీ నాగబాబు, రోజా.. వీరిద్దరి రాజకీయ దారులు వేరు.. ఒకరు వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే.. మరికొరు జనసేనాని పవన్ అన్నయ్య నర్సాపురం ఎంపీగా బరిలోకి దిగారు. నాగబాబు ఓడిపోయి ఇక రాజకీయాల్లో తాత్కాలిక పుల్ స్టాప్ ఎదుర్కొంటున్నారు. ఇక నగరిలో గెలిచిన రోజాకు మంత్రి పదవి దక్కకపోవడంతో రోజా కూడా మళ్లీ జబర్ధస్త్ కు రావడం ఖాయంగా కనిపిస్తోంది..

ఈ సార్వత్రిక ఎన్నికల వేళ నాగబాబు నర్సాపురం ఎంపీగా గెలుస్తారని ప్రచారం బాగా చేశాడు. ఇక రోజా కూడా నగరి నుంచి గెలిచి మంత్రి అవుదామని ఆశించారు. కానీ నాగబాబు ఓడిపోయాడు.. రోజాకు గెలిచి మంత్రి కాలేదు. మంత్రిగా రోజా అయితే జబర్ధస్త్ కు దూరం అయ్యేదే.. కానీ రోజా కు పదవి లేకపోవడంతో ఇక ఇప్పుడు బుల్లితెరపై రోజా సందడి మళ్లీ కనిపించబోతోంది..

జబర్ధస్త్ జడ్జీలు అయిన నాగబాబు, రోజాలు లేక కొద్దిరోజులుగా జబర్ధస్త్ కళ తప్పింది. రోజా తిరిగి వచ్చినా నాగబాబు మాత్రం రాలేదు. అలీ కొనసాగారు. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన జబర్ధస్త్ ప్రోమోలో నాగబాబు, రోజాలు కలిసి నటించారు. కనిపించారు. దీంతో జబర్ధస్త్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇలా రాజకీయంగా వారికి అవకాశాలు దక్కకపోవడంతో మళ్లీ జబర్ధస్త్ లో నాగబాబు, రోజాలు బిజీ అయ్యారు. వారికి పదవులు దక్కకపోవడం ఒకరకంగా వారికి నిరాశ కలిగించిన జబర్ధస్త్ అభిమానులకు మాత్రం కన్నుల పండువగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -