Tuesday, April 30, 2024
- Advertisement -

లవర్ బాయ్ పాత్రలో కార్తికేయ

- Advertisement -

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో మంచి విజయాన్ని సాధించినప్పటికీ యువహీరో కార్తికేయ ‘హిప్పీ’ సినిమాతో మరొక హిట్ అందుకోలేకపోయాడు. ఇప్పుడు కొత్త దర్శకుడు అర్జున్ జంధ్యాల తో చేతులు కలిపిన కార్తికేయ త్వరలో ‘గుణ 369’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అనాఘ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఇవాళ విడుదలైంది. “మనం చేసే తప్పుల వల్ల మనకు ఏమైనా పర్లేదు కానీ ఎదుటి వారికి మాత్రం ఏ హాని కలగా కూడదు” అని సాయికుమార్ చెప్పే డైలాగ్ తో మొదలైన ఈ టీజర్ లో కార్తికేయ మొదట లవర్ బాయ్ గా కనిపిస్తాడు.

హీరోయిన్ తో మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేసిన కార్తికేయ ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. ఎస్ జి మూవీ మేకర్స్ పతాకంపై తిరుమలరెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ‘హిప్పీ’తో మంచి విజయాన్ని అందుకోలేక పోయిన కార్తికేయ ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి. ఈ సినిమా విడుదల తేదీ గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -