Thursday, May 2, 2024
- Advertisement -

హ్రితిక్ రోషన్ ని అనవసరం లాగారు

- Advertisement -

కూకట్పల్లి నివాసుడు శశికాంత్ కల్ట్ ఫిట్ అనే జిమ్ లో జాయిన్ అయ్యి, డబ్బులు కట్టి సరిగా సంతృతప్తి పడక, అక్కడి స్టాఫ్ ప్రవర్తన కూడా నచ్చక, అటు జిమ్ యాజమాన్యం పైనా, అలాగే వారి బ్రాండ్ అంబాసడర్ హ్రితిక్ రోషన్ పైన కేసు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. నిన్న ఉదయం ఈ వార్త బయటకు రావడం తో ఒక్కసారి గా అందరూ ఈ వార్త మీద దృష్టి పెట్టారు. అయితే కేసు వివరాల్లోకి వెళితే, పోలీసులు కేసు ని స్వీకరించి ప్రస్తుతం దర్యాప్తు మొదలు పెట్టారు.

అయితే బెంగళూరు కి సంబందించిన ఈ జిమ్ ఓనర్లు ఈ విషయమై మాట్లాడుతూ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పైనే రివర్స్ అయ్యారు.కంపెనీ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేసిన ఆరోపణలు అన్నిటినీ తిప్పి కొట్టింది. దానిని తిప్పి కొట్టడమే కాకుండా ఇంకా తిరిగి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి దే తప్పు అని తిరిగి ఆరోపణలు చేసింది. “దీనిలోకి అనవసరం గా మా బ్రాండ్ అంబాసడర్ హ్రితిక్ రోషన్ ని లాగుతున్నారు.ఈ కేసు విషయం లో మేము పోలీసులకి పూర్తి గా సహకారం ఇస్తున్నాము.” అని కంపెనీ వాళ్ళు చెప్పారు.

ఈ కేసు లో అసలు నిజమెవరిది, నిజంగా నే పోలీసులు హ్రితిక్ రోషన్ వరకు వెళ్తారా అనేది వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -