Saturday, May 18, 2024
- Advertisement -

అదిరిపోయే స్టెప్పులతో సైకో సైయాన్

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సాహో’ సినిమాపై భారీ అంచనలున్న సంగతి తెలిసిందే. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మేకింగ్ వీడియోలు మరియు టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ మారాయి. తాజాగా సినిమా లోంచి మొదటి పాటని విడుదల చేశారు. “సైకో సైయాన్” అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వీడియో కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఊహించిన విధంగానే ప్రభాస్ మరియు శ్రద్ధ అదిరిపోయే స్టెప్పులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పూర్తి పాట త్వరలో విడుదల కానుంది.

టి సిరీస్ మరియు యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో జాకీ శ్రోఫ్, నీల్ నితిన్ ముకేష్, అరుణ్ విజయ్, మందిరా బేడి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 విడుదల కాబోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -