Sunday, May 19, 2024
- Advertisement -

అల్లు అర్జున్19 కి హీరోయిన్ షాక్?

- Advertisement -

పూజ హెగ్డే కి తెలుగు సినిమా పరిశ్రమ లో ఎంత మంచి పేరు ఉంది, బాలీవుడ్ లో కూడా అంతే మంచి పేరు ఉంది. తెలుగు లో ఒక లైలా కోసం, ముకుంద అనే సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో మొహెంజొదారో అనే సినిమా కూడా చేసింది. ఆ తర్వాత తెలుగు లో దువ్వాడ జగన్నాధం చేసి వరుసగా అవకాశాలు తెచ్చుకుంది. ఇటీవలే హౌజ్ఫుల్ 4 అనే సినిమా లో ఒక కీలక పాత్ర పోషించిన పూజ బాలీవుడ్ లో ఎలాగైనా ఒక సుస్థిర స్థానం సంపాదించుకోవాలనే తపన తో అదే నిర్మాణ సంస్థ తో మరొక మూడు కొత్త సినిమాలని ఒప్పుకుంది. అయితే ఆసక్తికరం అంశం ఏంటి అంటే పూజ ని ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు ఒక రెండు నెలల డేట్స్ ఇవ్వాలని అడుగుతున్నారట. ఆ రేంజ్ లో నే పారితోషికం కూడా ఇష్టం అని ఆశ పెట్టారట.

అందుకని పూజ కూడా ఏమి మాట్లాడకుండా దానికి ఒప్పేసుకోవాలని చూస్తుందట. ఒకవేళ అదే జరిగితే త్రివిక్రమ్-అల్లు అర్జున్ సినిమా కి ఎక్కువ రోజులు పూజ అందుబాటు లో ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. పూజ ఇంతకు ముందు ఈ హీరో తో, దర్శకుడి తో పని చేసింది, పైగా పూజా నే కావాలని ఆమెని ఈ సినిమాలోకి తీసుకున్నారు దర్శక నిర్మాతలు. అందుకే హిందీ వైపు మొగ్గు చూపి వీళ్ళని ఎలాగైనా మానేజ్ చేయాలనే ఆలోచన తో ఉంది అంట పూజ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -