Sunday, May 12, 2024
- Advertisement -

రామాయణం పై అల్లు అరవింద్ ప్లాన్స్ ఏంటి?

- Advertisement -

టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తరఫునుంచి నిర్మాత అల్లు అరవింద్ గత కొంతకాలంగా రామాయణం పై సినిమా తీయబోతున్నట్టు హింట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ ఈ సినిమాలో రాముడి పాత్ర పోషిస్తారు అని పుకార్లు వినిపిస్తున్నాయి. దంగల్ ఫేమ్ నితీష్ శ్రీవారి దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రానికి 15 వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా. నిజంగా సినిమాకి అంత బడ్జెట్ పెడితే పెట్టిన డబ్బులు వెనక్కి రావడానికి సినిమాలో అన్ని భాషల ప్రేక్షకులను ఆకర్షించగల స్టార్ కాస్ట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. రాముడి పాత్రలో ఎలాగో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు.

మరి శ్రీరామునికి నమ్మినబంటు అయినా హనుమంతుని పాత్ర లో కనిపించడానికి కూడా ప్రముఖ నటులే కావాలి. రానా దగ్గుబాటి, ఎన్టీఆర్ వంటి హీరోలైతే పాత్రకు న్యాయం చేయగలరు అని కొందరు అంటున్నారు. ఇప్పటికే సీత పాత్రలో నయనతార నటించింది. కాబట్టి రామ్ చరణ్ సరసన మళ్ళీ నయనతార సీతగా మారే అవకాశం ఉందో లేదో చూడాలి. మరోవైపు రావణుడి పాత్రలో పవర్ఫుల్ విలన్ ఇమేజ్ ఉన్న సౌత్ యాక్టర్ లేదా బాలీవుడ్లోని అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోల అయితే బాగుంటుందని అంచనా. ఏదైమైనా ఈ సినిమా అలాంటి స్టార్ కాస్ట్ ఉంటుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -