- Advertisement -

రొమాంటిక్ పోస్టర్ తో ‘సాహో’ విడుదల తేది

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ వీడియోలు, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమాని ఆగస్ట్ 15న విడుదల చేయనున్నామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ‘సాహో’ సినిమా ఇప్పుడు ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇదే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ‘సాహో’ విడుదల తేదీ పోస్టర్ పై ప్రభాస్ మరియు శ్రద్ధ కపూర్ ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ రొమాంటిక్ గా పోజ్ ఇచ్చారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్రభాస్ మరియు శ్రద్ధ కపూర్ ల కెమిస్ట్రీ కూడా హైలైట్ గా మారనుందని పోస్టర్ చూస్తే తెలుస్తుంది. యూవీ క్రియేషన్స్ మరియు టీ సిరీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి గిబ్రాన్ సంగీతాన్ని అందించారు. నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్, మందిరా బేడి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -