Monday, May 20, 2024
- Advertisement -

బీసీసీఐ సెలక్షన్ కమిటీపై మండిప‌డ్డ మాజీ కెప్టెన్ గంగూలి….

- Advertisement -

విండీస్ టూర్‌కు భార‌త జ‌ట్టును ఎంపిక చేసింది సెల‌క్ష‌న్ క‌మిటీ. అయితే వెస్టిండీస్‌-ఏ జట్టుతో జరిగిన ఐదు వన్డేల అనధికారిక సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ జాతీయ జట్టులోకి తీసుకోక‌పోవ‌డంపై మాజీ కెప్టెన్ గంగూలి బీసీసీఐ సెలక్షన్ కమిటీపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. శుబ్‌మ‌న్ గిల్‌ను ఎంపిక‌చూయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌న్నారు.

శుభమన్ గిల్ ని జట్టులో ఎంపిక చేయకపోవడం.. అజింక్య రహానెను కేవలం టెస్టు మ్యాచ్ లకు పరిమితం చేయడం పై సౌరవ్ గంగూలీ మండిపడుతున్నారు. సెలక్షన్ కమిటీ మొత్తం మూడు ఫార్మాట్ లలో ఒకే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని… అందరినీ సంతోషపరచడానికి జట్టుని ఎంపిక చేయడం సరికాదని గంగూలీ అభిప్రాయపడ్డారు. ట్విట్ట‌ర్‌లో త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.అన్ని ఫార్మాట్లకు ఒకే ఆటగాళ్లను ఎంపిక చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల ఆటగాళ్లు మరింత ఆత్మవిశ్వాసంతో రాణిస్తారని పేర్కొన్నారు.వెస్టిండీస్-ఏ సిరీస్ లో అద్భుత ప్రదర్శన కనపరిచిన శుభమన్ ని అసలు ఎంపిక చేయక పోవ‌డంతో సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -