Sunday, April 28, 2024
- Advertisement -

టీమిండియాలో గిల్ శకం మొదలైందా ?

- Advertisement -

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా యువ ఆటగాడు శుబ్ మన్ గిల్ కు సంబంధించిన చర్చే అధికంగా జరుగుతోంది. ఈ 23 ఏళ్ల చిచ్చర పిడుగు అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మాట్ లలోనూ తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతునాడు. తాజాగా కివీస్ తో జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో మెరుపు సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. మొదట టెస్టులలో సెంచరీ, ఆ తరువాత వన్డేలలో డబుల్ సెంచరీ.. ఇప్పుడు టి20లో మెరుపు సెంచరీ చేసి ఇండియన్ క్రికెట్ అభిమానులను ఒక్కసారిగా తిప్పుకోవడంతో పాటు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. సొంతగడ్డపై కివీస్ తో జరుగుతున్నా మూడు టి20 మ్యాచ్ లలో మొదటి రెండు మ్యాచ్ లలోనూ కాస్త నిరాశ పరిచిన గిల్ చివరి మ్యాచ్ లో మాత్రం విశ్వరూపం సాధించాడు. .

కివీస్ బౌలర్లను చీల్చి చెండాడుతూ కేవలం 63 బంతుల్లోనే 126 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది. గిల్ తో పాటు ఓపెనర్ గా వచ్చిన ఇషాన్ కిషన్ ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా, ఆ అరువత వచ్చిన రాహుల్ త్రిపాఠి 22 బంతుల్లో 44 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 24 పరుగులు, హర్ధిక్ పాండ్య 17 బంతుల్లో 30 పరుగులు చేశారు. అయితే జట్టు మొత్తం కలిసి 234 పరుగులు చేయగా అందులో 126 పరుగులు గిల్ ఒక్కడే చేశాడు. గిల్ చేసిన మొత్తం స్కోర్ లో కేవలం బౌండరీల ద్వారానే 90 పరుగులు వచ్చాయంటే అతని వీర విహారం ఏ స్థాయిలో ఉండిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి 66 పరుగులకే కుప్పకూలింది. దాంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక గిల్ అద్భుతమైన సెంచరీతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో గిల్ కి ఇదే మొదటి సెంచరీ. ఈ ఫార్మెట్ లో సెంచరీ చేసిన ఏడవ బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు. ఈ లిస్ట్ లో సురేశ్ రైనా, రోహిత్ శర్మ, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి గిల్ రికార్డులను పరిశీలిస్తే.. మూడు ఫార్మెట్ లను కలిపి ఏకంగా అయిదు సెంచరీలను బాదాడు. అందులో ఒకటి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఇలా గిల్ ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ తనదైన ముద్ర వేస్తూ రాబోయే రోజుల్లో టీమిండియాలో గిల్ శకం మొదలు కానుంది సంకేతాలను పంపిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -