Tuesday, April 30, 2024
- Advertisement -

నా గురించి ఎవ‌రు ఏమ‌నుకున్నా ఐ డోంట్ కేర్ అంటున్న ర‌ష్మిక‌

- Advertisement -

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో ఉన్న హీరోయిన్లు అందరిలోకి మంచి ప్రతిభ కనబరుస్తూ స్టార్డం లోకి చొచ్చుకెళ్తున్న భామ రష్మిక. డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీ గా గడుపుతుంది ఈ భామ.

అయితే సాధారణం గా రష్మిక నోరు జారదు కానీ నిన్న జరిగిన డియర్ కామ్రేడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తను పోషించిన లిల్లీ పాత్రకి పేరు వస్తే చాలు, రష్మిక కి విజిల్స్ పడినా పడకపోయినా పర్లేదు అనే ఉదేశ్యం తో మాట్లాడింది. ఈ విషయం మీద కొంత మంది అభిమానులు హర్ట్ అయ్యారు. రష్మిక ఇంటెన్షన్ వేరే అయినా తన మాట వేరే గా కన్వే అయింది.

ఇకపోతే ఇదే విషయాన్ని ఒక అభిమాని రష్మిక దగ్గర ప్రస్తావిస్తూ, “మేము మిమ్మల్ని తప్పు గా అర్ధం చేసుకున్నామో ఏమో నాకు అయితే తెలియదు కానీ, ఐ డోంట్ కేర్ అని మీరు అనడం లో అర్ధం ఏంటి. మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాము.” అని అడుగగా రష్మిక సమాధానం ఇచ్చింది.

“నేను అన్నది ఏంటి అంటే, సినిమా చూసి మీరు బయటకు వచ్చాక లిల్లీ పాత్ర కి ఇవ్వాల్సిన గుర్తింపు ఇస్తే చాలు. రష్మిక అని నాకు విజిల్స్ వేయకపోయినా పర్లేదు.” అని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -